ముంబై చేరిన సాహో టీమ్

ముంబై చేరిన సాహో టీమ్

ప్రభాస్ హీరోగా చేస్తున్న హైవోల్టేజ్ సినిమా సాహో.  ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.  ఫైనల్ షెడ్యూల్ ముంబైలో ఈరోజు ప్రారంభం అవుతున్నది.  ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది.  ఆగష్టు 15 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ హీరోయిన్.  సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  

ఈ సినిమాతో పాటు ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  రెండు సినిమాలు షూటింగ్ వరసగా జరుగుతున్నాయి.  జాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.