సాహో ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..!!

సాహో ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..!!

ప్రభాస్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సంచనాలు సృష్టించింది.  ఈ టీజర్ తరువాత అంచనాలు పెరిగాయి.  సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో.. ఎప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.  ఇదిలా ఉంటె ఈ మూవీ కి సంబంధించిన సాంగ్ సింగిల్స్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు.  

ఈరోజు ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ గురించిన అనౌన్సమెంట్ ఉంటుందని యూవీ క్రియేషన్స్ పేర్కొంది.  ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన కొన్ని పాదాలను కూడా రిలీజ్ చేసింది.  ఫస్ట్ సింగిల్ డేట్ ఎప్పుడు ఏంటి అన్నది ఈరోజు తెలియజేస్తారట.  అయితే, ఈరోజు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అన్నది ఇంకా తెలియలేదు.  దీన్ని కూడా సస్పెన్స్ లో పెట్టారన్నమాట.