రూ.30కోట్ల షేర్ పై కన్నేసిన సాహో ..!!

రూ.30కోట్ల షేర్ పై కన్నేసిన సాహో ..!!

ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులైంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ370 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అటు బాలీవుడ్లోను ఇటు నైజాంలోను ఈ సినిమా దూసుకుపోతున్నది.  ఇప్పటికే ఈ మూవీ నైజాంలో రూ.27.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శనివారం రోజున దాదాపుగా రూ. 40లక్షల రూపాయల షేర్ ను వసూలు చేసిన సాహో, ఆదివారం రోజున ఎంత వసూళ్లు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది.  

కలెక్షన్లు ఈ విధంగానే మరో రెండు మూడు రోజులు ఉంటె.. తప్పకుండా రూ. 30 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశం ఉన్నది. నెగెటివ్ టాక్ లోను ఈ స్థాయిలో వసూళ్లు సాధించింది అంటే మామూలు విషయం కాదు.  అటు యూఎస్ లోను ఈ సినిమా ఇప్పటికే మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది.