భయపెడుతున్న సాహో ప్రీ రిలీజ్ బిజినెస్

భయపెడుతున్న సాహో ప్రీ రిలీజ్ బిజినెస్

సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భయపెట్టేలా ఉన్నది.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 255 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసినట్టు సమాచారం అందుతోంది.  తెలుగురాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 120 కోట్ల వరకు సేల్ అయ్యింది.  అటు కర్ణాటకలో రూ27 కోట్లు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రూ. 21 కోట్లు, నార్త్ లో రూ.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.43 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.  

ఈ స్థాయిలో ప్రాంతీయ సినిమా బిజినెస్ చేసుకోవడం విశేషం.  దీనిని బట్టి చూస్తుంటే.. సినిమా రిలీజ్ తరువాత బాహుబలి రికార్డులు బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.  సాహో ఈ రికార్డును బ్రేక్ చేస్తే.. ఆ రికార్డును బ్రేక్ చేయడానికి ఆర్ఆర్ఆర్ సిద్ధంగా ఉంటుంది.