సాహో కోసం ముస్తాబైన ఆర్.ఎఫ్.సి..

సాహో కోసం ముస్తాబైన ఆర్.ఎఫ్.సి..

ప్రభాస్ సాహో ప్రీ రిలీజ్ వేడుకకు అన్ని సిద్ధం చేసుకుంటోంది.  రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.  దాదాపు లక్షమంది అభిమానులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.  వీరికోసం ఇప్పటికే పాసులు జారీ చేసింది యూనిట్.  ఈ వేడుకలో యూనిట్ అంతా పాల్గొంటోంది.  అంతేకాదు, ఈ మూవీలో వినియోగించిన భారీ వాహనాలు, ఖరీదైన కార్లు, బైకులు, యుద్ధ ట్యాంకర్లను కూడా ప్రదర్శనగా ఉంచారు.  

ఈ వేడుకకు అవి ఎట్రాక్షన్ గా ఉండబోతున్నాయి.  యూనిట్ కోసం విశాలమైన వేదికను ఏర్పాటు చేశారు.  ఈ సాయంత్రం 5 గంటల నుంచి ఈ సాహో ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభం కాబోతున్నది.  ప్రీ రిలీజ్ వేడుక కోసం సిద్ధం చేసిన సెట్ కు దాదాపు రూ. 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం.  ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.