సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్....

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్....

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ ప్రాంగణంలో మరికొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ని మరపురాని ఈవెంట్ గా నిలిపేందుకు ఫిలింసిటీలో భారీ ఏర్పాట్లను చేసింది శ్రేయాస్ మీడియా సంస్థ. సుజీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రద్దా కపూర్ లు జంటగా నటించగా ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు అనేది ఇంకా తెలకపోయినా ఈ ఈవెంట్ లో సాహో యూనిట్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ టీవీ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది. డోంట్ మిస్ ది స్టన్నింగ్ సాహో అప్డేట్స్