సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది...!!

సాహో సైకో సయాన్ టీజర్ వచ్చేసింది...!!

ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో ఫస్ట్ సింగిల్ టీజర్ వచ్చేసింది.  కొద్దిసేపటికి క్రితమే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.  అల్ట్రా ఎలెక్ట్రిక్ మ్యూజిక్ తో అదిరిపోయింది.  జస్ట్ 28 సెకన్ల నిడివికలిగిన ఈ సాంగ్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.  జులై 8 వ తేదీన ఈ ఫస్ట్ సింగిల్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.  

భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్స్ రోజుకొక్కటి చొప్పున రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అయ్యింది.  పోస్టర్లు, ఫోటోలు, సింగిల్స్ టీజర్, సింగిల్స్ ను రిలీజ్ వరసగా రిలీజ్ చేస్తారట.  ఆడియో, ప్రీ రిలీజ్ ఎప్పుడు అన్నది త్వరలోనే ప్రకటించనున్నారు.