ఆ రెండు రాష్ట్రాల్లో సాహో రికార్డులు..!! 

ఆ రెండు రాష్ట్రాల్లో సాహో రికార్డులు..!! 

ఆగష్టు 30 వ తేదీన రిలీజైన ప్రభాస్ సాహో సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.  సినిమాపై ఎన్నో హోప్స్ ఉన్నా.. రిలీజ్ తరువాత ఆ స్థాయిలో లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది.  కానీ, బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు.  సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  టాక్ తో సంబంధం లేకుండా సినిమా దాదాపుగా రూ. 150 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది.  

ఇదిలా ఉంటె, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం విశేషం.  బాహుబలి 2 తరువాత ఆ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాగా సాహో నిలిచింది.  అటు బీహార్ లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది సాహో.  భజరంగి భాయ్ జాన్, పీకే, సింబా చిత్రాలకు మించి అక్కడ వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది సాహో.