సాహో రిలీజ్ డేట్ ఫిక్స్

సాహో రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రభాస్ హీరోగా చేస్తున్నసాహో సినిమా రిలీజ్ ఆగష్టు 15 నుంచి వాయిదా పడిన సంగతి తెలిసిందే.  వాయిదా విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన యూనిట్, రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.  ఆగష్టు 30 వ తేదీన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  

ఎక్కడా రాజీపడకుండా విజువల్ ఎఫెక్ట్స్ ను సిద్ధం చేస్తున్నారట.  ఫస్ట్ హాఫ్ ను ఇప్పటికే లాక్ చేశారు.  సెకండ్ హాఫ్ ఎడిటింగ్ జరుగుతున్నది.  మరో వారం పది రోజుల్లో మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం.  జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్ కు జోడిగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.