'సాహో' వాయిదాపడుతుందా ?

'సాహో' వాయిదాపడుతుందా ?

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'.  చాలా రోజుల పాటు జరిగిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ముగిసింది.  ఇంకొన్ని పాటలు, ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలున్నాయి.  అవి పూర్తయ్యేనాటికి జూన్ నెల పడుతుంది.  ఇక పోస్ట్ ప్రొడక్ష పనులకు ఎక్కువ సమయమే కేటాయించాల్సి ఉంటుంది.  దీంతో ముందుగా అనుకున్న ప్రకారం చిత్రాన్ని ఆగష్టు 15వ తేదీకి విడుదలచేయడానికి కుదరకపోవచ్చట.  అందుకే ఆ తేదీని అక్టోబర్ నెలకు వాయిదావేసి సూచనలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.