సాహో సుజీత్ తర్వాతి సినిమా హీరో ఫిక్స్.. ఎవరంటే..?

సాహో సుజీత్ తర్వాతి సినిమా హీరో ఫిక్స్.. ఎవరంటే..?

టాలీవుడ్ డైరెక్టర్ సుజీత్ ఒక్క సినిమాతో స్టార్ హోదాను అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా సాహోను తెరకెక్కించిన సుజీత్ అనుకున్న స్థాయి హిట్ అందుకోలేక పాయారు. కానీ అతడి పనితీరుకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. అయితే ఇటీవల బాలీవుడ్ పరిశ్రమ నుంచి సుజీత్‌కు ఓ మంచి అవకాశం దక్కింది. అతడితో ఓ భారీ బడ్జెట్ సినిమా తీసేందుకు బాలీవుడ్ మేకర్స్ సిద్దంగా ఉన్నారు. తాజాగా సుజీత్ తదుపరి సినిమా గురించి వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సుజీత్ తన తదుపరి సినిమా కోసం కొందరు స్టార్లతో సంప్రదింపులు చేశారంట. వారిలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్‌ కూడా ఉన్నారు. కానీ సుదీప్ ఇప్పటి వరకు తన సమాధానం చెప్పలేదని టాక్ నడుస్తోంది. మరి సుజీత్ తన బాలీవుడ్ సినిమాకి సుదీప్‌ను ఓకే చేసుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. హీరో ఫిక్స్ అయితే సుజీత్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.