ముంబై బాట పట్టిన సాహో సుజీత్ 

ముంబై బాట పట్టిన సాహో సుజీత్ 

షార్ట్ ఫిలిమ్ తీసిన అనుభవంతో శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' సినిమా తీశాడు సుజీత్. అవకాశం కల్పించింది యువీ క్రియేషన్స్ సంస్థ. తొలి సినిమా హిట్ తో తంతే గార్లె గంపలో పడ్డాడు సుజీత్. ప్రభాస్ హీరోగా ఏకంగా పాన్ ఇండియా సినిమా `సాహో` తెరకెక్కించాడు. రెండో సినిమాకే భారీ  బడ్జెట్ తో సాహసం చేశాడనే చెప్పాలి. సాహో హిందీ లో సక్సెసైనా తెలుగుతో పాటు ఇతర రంగాల్లో పరాజయం పొందింది. ఆ తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ తో పాటు.. బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ కి సుజీత్ దర్శకుడంటూ ప్రచారమైంది. అయితే అవేవీ సెట్ కాలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రం హిందీలో లాక్ అయ్యిందట. జీ స్టూడియోతో సుజీత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రొడక్షన్ హౌస్ అధికరికంగా ప్రకటించింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కు సుజీత్ స్క్రిప్ట్ వినిపించాడట. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారట. 2022లో సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. కరోనా టైమ్ లో ప్రియురాలిని వివాహం చేసుకున్న సుజీత్ ఈ ప్రాజెక్ట్ కోసం ముంబై షిప్ట్ అవుతున్నాడట. మరి సుజీత్ తొలి యత్నంలోనే బాలీవుడ్ లో హిట్ కొడతాడేమో! లెట్స్ వెయిట్ అండ్ సీ.