నైట్ షూట్లో 'సాహో' టీమ్ !

నైట్ షూట్లో 'సాహో' టీమ్ !

నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 'సాహో' చిత్రాన్ని ముందుగా చెప్పినట్టు ఆగష్టు 15వ తేదీన ప్రేక్షకులకు అందివ్వడానికి చాలా కష్టపడుతోంది.  ఇప్పటీకే చాలావరకు చిత్రీకరణ ముగించిన టీమ్ మిగిలిన చిత్రీకరణను కంప్లీట్ చేయటానికి రాత్రి, పగలు కష్టపడుతోంది.  ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్లో షూట్ చేస్తున్నారు.  బాహుబలి తరవాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.  సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కథానాయికగా నటిస్తోంది.  హెవీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఒకేసారి రిలీజ్ కానుంది.