సాహో టీజర్ డేట్ వచ్చేసింది..

సాహో టీజర్ డేట్ వచ్చేసింది..

ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు.  అయితే, ప్రమోషన్ వీడియోస్ ను ఎప్పటి నుంచి రిలీజ్ చేయడం ప్రారంభిస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ తరుణంలో టీజర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.  

ప్రభాస్ సాహో టీజర్ జూన్ 13 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  సాహో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.  ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న టీజర్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.