సాహో టీజర్.. డైహార్డ్ ఫ్యాన్సుకు పండగ

సాహో టీజర్.. డైహార్డ్ ఫ్యాన్సుకు పండగ

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'సాహో' యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  అందరూ ఊహించినట్టే టీజర్ భారీ యాక్షన్ సన్నివేశాలతో ఓహో.. అనేలానే ఉంది.  ఛేజింగ్ సీన్స్, హెవీ ఫైట్స్, విదేశీ లొకేషన్లు, ఫారిన్ ఫైటర్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే సినిమాకు ఎందుకంత బడ్జెట్ ఖర్చు పెట్టారనేది అర్థమవుతోంది.  ఇక ప్రభాస్ అయితే యాక్షన్ హీరోగా అద్దిరిపోయేలా కనిపిస్తున్నారు.  సుజీత్ అన్ని జాగ్రత్తలు తీసుకుని టీజర్ ఆకట్టుకునే కట్ చేశారు.  ఒక మాటలో చెప్పాలంటే ఈ టీజర్ ప్రభాస్ డై హార్డ్ అభిమానులకు పండగనేలా ఉంది.