'సాహో' వాయిదా కన్ఫర్మ్

'సాహో' వాయిదా కన్ఫర్మ్

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'సాహో' ఆగష్టు 15న విడుదలవుకావాల్సి ఉంది.  కానీ నిర్మాణాంతర పనులు ఇంకా పూర్తికాలేదు.  సమయం తక్కువగా ఉందని హడావుడిగా పనులు చేస్తే అవుట్ ఫుట్ సక్రమంగా ఉండదని భావించిన నిర్మాతలు చిత్రాన్ని వాయిదావేయడమే మంచిదని భావిస్తున్నారట. 

అందుకే 15వ తేదీని నుండి ఆగష్టు 30కి చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేస్తారని తెలుస్తోంది.  యూవీ క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కథానాయికగా నటిస్తోంది.  సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న  ఈ చిత్రంలో కేవలం 8 నిముషాల నిడివి గల ఒక్క సన్నివేశం కోసం ఏకంగా 70 కోట్లు వెచ్చించారు.