తెరుచుకున్న శబరిమల ఆలయం..

తెరుచుకున్న శబరిమల ఆలయం..

శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని మళ్లీ తెరిచారు. ఇవాళ ఉదయం 50ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేపట్టారు. ఈక్రమంలో ఆలయాన్ని దాదాపు గంట పాటు  మూసివేసి శుద్ధి చేశారు. అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచి భక్తుల దర్శనానికి వీలు కల్పించారు. కోజికొడె జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ ఇవాళ తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరి ప్రవేశంపై బీజేపీ కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.