రాజన్న సినిమాను చూసిన చేవెళ్ల చెల్లెమ్మ..!!
వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. ఫిబ్రవరి 8 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాను చేవెళ్ల చెల్లెమ్మగా పేరు తెచ్చుకున్న సబితా ఇంద్రారెడ్డి ప్రజల సమక్షంలో థియేటర్లో సినిమా చూశారు.
రాజన్న జీవిత చరిత్రను తెరపై అద్భుతంగా తీసిన దర్శక నిర్మాతలకు ఆమె అభినందనలు తెలిపారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తుండటం విశేషం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)