వెనక్కి తగ్గిన సబితా ఇంద్రారెడ్డి..!

వెనక్కి తగ్గిన సబితా ఇంద్రారెడ్డి..!

కాంగ్రెస్ సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అలియాస్ చేవెళ్ల చెల్లెమ్మ పార్టీ మార్పుపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిగా ఆమెను టీఆర్ఎస్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు  జరిగాయి. అసద్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె కారెక్కడం ఖాయమనే ప్రచారం జరిగింది. సబితకు మంత్రివర్గంలో చోటు కల్పించి.. కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ స్థానం కేటాయిస్తారనే గుసగుసలు కూడా వినిపించాయి. అయితే, రంగంలోకి దిగిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... సబితాఇంద్రారెడ్డితో చర్చించారు. రేవంత్ రాయబారం ఫలించడంతో పార్టీ మార్పుపై ఆమె వెనక్కి తగ్గారు. ఇక ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గరకు సబితాఇంద్రారెడ్డిని రేవంత్ తీసుకెళ్లలనున్నారు.