రేపు టీఆర్‌ఎస్‌లోకి సబిత?

రేపు టీఆర్‌ఎస్‌లోకి సబిత?

ఎమ్మెల్యేలను చేజార్చుకుంటూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుంది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించారు. కుమారుడు కార్తీక్‌తోపాటు రేపు ఉదయం టీఆర్‌ఎస్‌లో ఆమె చేరనున్నారు. సబిత టీఆర్ఎస్‌లో చేరతారని కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌తో భేటీ అయినట్టు కూడా వార్తలొచ్చాయి. హైకమాండ్‌ ఆదేశాలతో రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించడంతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఇవాళ ఉదయం వార్తలు వినిపించాయి. కానీ.. కార్తీక్‌కు చేవెళ్ల టికెట్‌ కేటాయించే అంశంపై స్పష్టమైన హామీరాకపోవడంతో గులాబీ గూటికి చేరాలని సబిత నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌ సమక్షంలో రేపు టీఆర్‌ఎస్‌లో చేరుతారని సమాచారం