వరల్డ్‌కప్‌లో భారత్‌కు అతనే కీలకం: సచిన్‌

వరల్డ్‌కప్‌లో భారత్‌కు అతనే కీలకం: సచిన్‌

ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నమెంట్లలో టీమిండియాకు వికెట్‌కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఎంతో కీలకమని లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. కీపింగ్‌ చేసే సమయంలో గ్రౌండ్ మొత్తాన్ని పరిశీలించే అవకాశం ధోనీకి ఉంటుందని.. బ్యాటింగ్‌కు ఇది ప్లస్ పాయింట్‌ అని అభిప్రాయపడ్డాడు. పిచ్‌ స్వరూపాన్ని అర్థం చేసుకుని కెప్టెన్‌, బౌలర్లతో ధోనీ చర్చిస్తాడని.. బౌలర్లకు సూచనలు ఇవ్వొచ్చని సచిన్‌ అన్నాడు. క్లిష్ట సమయాల్లో కెప్టెన్‌ కోహ్లీకి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ధోనీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని అన్నాడు. ఇక.. వరల్డ్‌కప్‌ వామప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడినంత మాత్రాన దిగులు పడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.