కోహ్లీలో నాకు నచ్చిందిదే..: సచిన్‌

కోహ్లీలో నాకు నచ్చిందిదే..: సచిన్‌

ఫామ్‌ కోల్పయి తంటాలు పడుతున్న టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మద్దతిచ్చాడు. ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో విరట్‌ కచ్చితంగా పరుగుల వరద పారిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతి ప్లేయర్‌ కెరీర్‌లోనూ ఒడుదొడుకులుంటాయని చెప్పాడు. తన లోపాల్ని అంగీకరించి, వాటిని సరిదిద్దుకున్నపుడే ఏ ఆటగాడైనా ముందంజ వేయగలుగుతాడని సచిన్‌ అన్నాడు. కోహ్లీ కూడా ఇదే కోవలోకి చెందుతాడని చెప్పాడు. 'కోహ్లీలోని అత్యుత్తమ లక్షణమేంటంటే.. తాను మెరుగు పడాల్సిన విషయాలను గుర్తిస్తాడు. వెంటనే వాటి మీద దృష్టిపెడతాడు' అని సచిన్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. కోహ్లీ కళ్లలో ఎప్పుడూ ఒక ఆకలి, ఒక తపన కనిపిస్తాయని చెప్పిన సచిన్‌.. ఒక పర్యటనకు ముందు కోహ్లి సన్నద్ధమయ్యే తీరు చాలా బాగుంటుందని అన్నాడు.