హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు

హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.  క్రికెట్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతోపాటు క్రికెట్ అభివృద్ధికి చేసిన కృషికి గాను సచిన్‌కు ఈ గౌరవం దక్కింది.  ఈ సందర్బంగా మాట్లాడిన సచిన్ ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు తెలిపారు.  సచిన్ కంటే ముందు ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న భారత్ క్రికెటర్లలో బిషన్‌సింగ్ బేడి, సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, అనిల్ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నారు.