ఎన్టీఆర్ బయోపిక్ లో సచిన్ పాత్ర ఇదే..!

ఎన్టీఆర్ బయోపిక్ లో సచిన్ పాత్ర ఇదే..!
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు.  ఈ సినిమాను బాలకృష్ణ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ దాదాపుగా పూర్తయింది.  ఎన్టీఆర్ జీవితంలో సున్నితమైన కీలకమైన విషయాలను బయోపిక్ లో చూపించబోతున్నారు.  ఎన్టీఆర్ జీవితంలో నాదెండ్ల భాస్కర రావు పాత్ర కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.  ఈ పాత్రకోసం మొదట పరేష్ రావెల్ ను అనుకున్నారు.  అయనతో సంప్రదించడం కూడా జరిగింది.  కానీ, ఎందుకో చివరి నిమిషంలో మార్పులు చేశారు.  పరేష్ రావెల్ ప్లేస్ లో సచిన్ ఖేద్కర్ ను తీసుకున్నారు.  
ఎన్టీఆర్ బయోపిక్ లో నటించేందుకు సచిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  నాదెండ్ల భాస్కర రావు పాత్రకు సచిన్ సరిగ్గా సరిపోతాడని.. అందుకే ఆయనను సంప్రదించినట్టుగా యూనిట్ చెప్తోంది.  స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయింది.  ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనున్నది.