అతనో స్పెషల్‌ టాలెంట్‌: సచిన్‌

అతనో స్పెషల్‌ టాలెంట్‌: సచిన్‌

ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ చిరకాల కోరిక తీరింది. ఇంగ్లీష్‌ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆఖరి బంతి వరకూ విజయం దోబూచులాడినా చెక్కుచెదరకుండా చివరి వరకూ నిలిచిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్టోక్స్‌ను ఆకాశానికెత్తేస్తూ ఏకంగా లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్స్ వంటి హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని స్టోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడనని సచిన్‌ ప్రశంచించాడు. అతనో స్పెషల్‌ టాలెంట్‌ అని అభిప్రాయపడ్డాడు. ఇక.. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మరింత ఆకట్టుకుంటున్నాడని సచిన్‌ అన్నాడు. అతని బ్యాటింగ్‌తోపాటు కెప్టెన్సీ కూడా తనకు ఎంతగానే నచ్చిందని అన్నాడు.