ఇది సచిన్ కోరిక..

ఇది సచిన్ కోరిక..

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో టీమిండియా వరుసగా రెండు విజయాలు సాధించింది... భారత జట్టు విజయాలపై సంతోషాన్ని వ్యక్తం చేసిన సచిన్ టెండూల్కర్... తన కోరికను వెల్లడించారు. ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక శతకాలు సాధించిన క్రీడాకారుడిగా తన పేరిట ఉన్న రికార్డుని.. టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ అధిగమిస్తే చూడాలని ఉందన్నారు క్రికెట్ దేవుడు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించిన ధావన్‌.. సెంచరీతో చెలరేగి పోయాడు. అయితే, ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్‌కు ఇది మూడో శతకం కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీలో మొత్తం కలిపి ఆరోది. దీంతో ఐసీసీ టోర్నమెంట్లలో కుమార సంగక్కర, రికీ పాంటింగ్‌లతో సమానంగా ఆరు శతకాలు సాధించాడు. వీరికన్నా ముందు సచిన్‌ తెందూల్కర్‌, సౌరభ్‌ గంగూలీ ఏడు శతకాలు సాధించిన వారిగా ముందున్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌ మాట్లాడుతూ తన పేరిట ఉన్న రికార్డుని ధావన్‌ ఈ ప్రపంచకప్‌లో అధిగమించాలని కోరుకున్నాడు. అదే సమయంలో ఫామ్‌ కోల్పోయిన ధావన్‌పై విమర్శల దాడి పెరిగిన సమయంలో తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడని కొనియాడాడు సచిన్.