ఫెదరర్‌ను చిట్కాలు అడిగిన లిటిల్ మాస్టర్... 

ఫెదరర్‌ను చిట్కాలు అడిగిన లిటిల్ మాస్టర్... 

కరోనా మహమ్మారి  లాక్ డౌన్ కారణంగా సచిన్ టెండూల్కర్ తన ఇంటి నుండి బయటికిరాలేదు. అయితే లాక్ డౌన్ సడలింపులు వచ్చిన తర్వాత తాజాగా తన స్నేహితులతో టెన్నిస్ కోర్టుకు వెళ్ళాడు లిటిల్ మాస్టర్. ముంబైలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తన స్నేహితులతో టెన్నిస్ ఆడుతున్నట్లు సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అయితే రోజర్ ఫెదరర్‌ను ఆ వీడియోకి ట్యాగ్ చేశాడు సచిన్, దాంతో పాటు ఆ టెన్నిస్ లెజెండ్ ను తన ఫోర్‌హ్యాండ్ ‌పై చిట్కాలు ఇవ్వమని అడుగుతున్నాడు ఈ క్రికెట్ లెజెండ్. కానీ ఫెదరర్ ఇంకా ఈ వీడియో స్పంహించలేదు. అయితే రెండు సంవత్సరాల క్రితం ఫెదరర్ యొక్క క్రికెట్ నైపుణ్యాలు టెండూల్కర్‌ను ఆకట్టుకున్నాయి, అతను వింబుల్డన్ రౌండ్ సందర్భంగా ఫార్వర్డ్ డిఫెన్స్ (క్రికెట్ షాట్) లాగా కనిపించే టెన్నిస్ షాట్ ఆడుతున్న వీడియో పై సచిన్ అతడిని ప్రశంసించాడు. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు గతంలో అనేక సందర్భాల్లో, ముఖ్యంగా వింబుల్డన్ లో కలుసుకున్నారు. టెండూల్కర్ ఎప్పుడు ఫెదరర్‌ను తన అభిమాన టెన్నిస్ ప్లేయర్‌గా తెలుపుతాడు.