గురువును గుర్తుచేసుకుని సచిన్ భావోద్వేగం..

గురువును గుర్తుచేసుకుని సచిన్ భావోద్వేగం..

గురువులేని విద్య లేదు.. అది చదువైనా.. మరే రంగమైనా.. గురువు శిక్షణ అవసరం. ఇక ఎంతవైరానా తమ గుర్తులను చూసుకునే రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’... ఈ సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తన గురువు రమాకాంత్ అచ్రేకర్‌ను గుర్తు చేసునుని భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో తన గురువుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన సచిన్... గురువులు విద్య మాత్రమే బోధించరని, విలువలు కూడా నేర్పిస్తారని పేర్కొన్నారు. ‘‘మా అచ్రేకర్ సార్ నేరుగా ఆడమని చెప్పేవారు. అది ఆటలోనే కాదు.. జీవితంలో కూడా అలాగే ఉండాలనేవారు. ఈరోజుకీ ఆయన పాఠాలే నాకు మార్గదర్శం.. నా జీవితంలో ఆయన పోషించిన పాత్రకు నేనెప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను'' అంటూ ట్వీట్ చేశారు క్రికెట్ లెజెండ్. 

అచ్రేకర్ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకున్న సచిన్ టెండూల్కర్... క్రికెట్ దేవుడిగా పిలుచుకునే స్థాయికి ఎదిగారు... అంతర్జాయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 200 టెస్ట్ మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు చేసిన సచిన్.. 463 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 18,426 పరుగులు చేసి కొత్త రికార్డులకు సృష్టించిన సంగతి తెలిసిందే.