ఫ్యాన్స్‌కి సచిన్ సర్‌ప్రైజ్..

ఫ్యాన్స్‌కి సచిన్ సర్‌ప్రైజ్..

తన ఫ్యాన్స్‌కి, సగటు క్రికెట్ ప్రేమికులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులను, ఎన్నో శిఖరాలను అదిరోహించిన సచిన్... ఎవరినీ అందనన్ని రికార్డులు సృష్టించాడు. ఇక ఈ దిగ్గజ ఆటగాడు మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టేశాడు. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, వీవీ లక్ష్మణ్.. ఇలా మరికొందరు దిగ్గజ క్రికెటర్ల మాదిరిగానే సచిన్‌ కూడా మైక్ పట్టేశాడు. క్రికెట్ వ్యాఖ్యాతగా మారిపోయాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాస్టర్‌బ్లాస్టర్.. తొలిసారిగా మైక్‌ అందుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో సచిన్ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య టోర్నీ తొలి మ్యాచ్‌కు సచిన్‌ కామెంటరీ బాక్సులో దర్శనమిచ్చాడు. గంగూలీ, సెహ్వాగ్‌లతో కలిసి కామెంటరీ చెప్పాడు. మ్యాచ్‌‌కు ముందు స్టార్‌ స్పోర్ట్స్‌ చర్చా కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి ‘సచిన్‌ ఓపెన్స్‌ అగేన్‌’ అని పేరు పెట్టారు.