బ్యాట్ల తయారీ సంస్థపై కోర్టుకెక్కిన సచిన్

బ్యాట్ల తయారీ సంస్థపై కోర్టుకెక్కిన సచిన్

ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ బ్యాట్ల తయారీ కంపెనీపై భారత్ మాజీ క్రికెటర్ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కోర్టుకెక్కారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి తన పేరు, ఇమేజ్ వాడుకుంటుందని ఆరోపించారు. సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న స్పార్టాన్‌ స్పోర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ అనే బ్యాట్ల తయారీ కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సివిల్‌ దావా వేశాడు. రాయల్టీ కింద తనకు 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని పేర్కొన్నాడు. ఈ సంస్థతో 2016లో సచిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సంవత్సరానికి ఒక మిలియన్ డాలర్లు సచిన్‌కు చెల్లించాలి. కానీ 2018 నుంచి తనకు రావాల్సిన రెండు మిలియన్‌ డాలర్ల రాయల్టీ రాలేదు. దీనిపై సంస్థ యాజమాన్యానికి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేదని సచిన్‌ వివరించారు. దీంతో తన పేరును వాడుకోవడం ఆపేయాలని, ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కంపెనీకి తెలియజేశానని సచిన్ అన్నారు. అయినా వారు తన పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గిల్బర్ట్ టోబిన్ న్యాయ సంస్థ కేసును డీల్ చేస్తోంది. ఈ ఏడాది జూన్ 5వ తేదీన కేసును ఫైల్ చేశారు.