కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని కోరిన సచిన్

కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని కోరిన సచిన్

ముంబయి కార్పొరేషన్‌ అంథేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో కరోనా రోగుల చికిత్స కోసం ప్లాస్మా థెరపీ యూనిట్‌ను క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. అలాగే కరోనా నుండి కోలుకున్న వారిని బ్లడ్ ప్లాస్మా దానం చేయాలని కోరారు. "కరోనా మహమ్మారి రూపంలో మనం కష్టమైన సవాలును ఎదుర్కొంటున్నాము. ఈ సందర్భంగా, మా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ మరియు ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి విరామం లేకుండా కృషి చేస్తున్నారు అని టెండూల్కర్ అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు వ్యాక్సిన్ ను కనుగొనటానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా...  ప్లాస్మా థెరపీ అనేది కరోనా రోగులకు చికిత్స చేయడానికి ఒక మార్గంగా అవతరించింది. కాబట్టి కరోనా నుండి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను  దానం చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను కాపాడాలని" అని సచిన్ కోరారు. ఇక ఇప్పటివరకు మన దేశం లో 791,559 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహారాష్ట్రలో రెండు లక్షలకు పైగా మంది ఈ వైరస్ బారిన పడ్డారు.