సచిన్‌ కు మరో అరుదైన గౌరవం

సచిన్‌ కు మరో అరుదైన గౌరవం

భారత క్రికెట్‌ లెజెండరీ ప్లేయర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు మరో అరుదైన అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ అభిమానుల మద్దతుతో సచిన్‌ అత్యధిక ఓట్లు సాధించి లారెస్‌ అవార్డ్స్‌ రేస్‌లో విజేతగా నిలిచాడు. ముంబై వాంఖడే స్టేడియంలో 2011 క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలిచాక భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకెళ్లిన అపురూప ఘటనకుగాను ఈ అవార్డు దక్కింది. భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలిచాక... భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజనాలపై మోసుకెళ్లి సంబరాలు చేసుకున్నారు. ఇది గత 20 ఏళ్లలో ప్రపంచ క్రీడల్లో అత్యంత అపురూప ఘటనగా ప్రతిష్టాత్మక అవార్డు లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డుకు ఎంపికయ్యింది. గత ఇరవై ఏళ్లలో క్రీడా చరిత్రలో మధురమైన ఘట్టాలకు   సంబంధించి ఓటింగ్ జరగ్గా... అందులో మాస్టర్‌కు అత్యధిక ఓట్లు దక్కాయ్‌. క్యారీడ్ ఆన్ ద షోల్డ‌ర్స్ ఆఫ్ నేష‌న్ అనే క్యాప్షన్‌తో ఓటింగ్ నిర్వహించారు. ఈ మూమెంట్‌కే ప్రస్తుతం అవార్డు ద‌క్కింది. బెర్లిన్‌లో జరిగిన లారెస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. వరల్డ్ కప్‌ను గెలుచుకున్న నాటి ఆనందాన్ని గుర్తుచేసుకున్నాడు సచిన్.