2 పాయింట్లు కాదు.. వరల్డ్ కప్ కావాలి: గంగూలీ
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. టీమిండియా ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే దాడిని నిరసిస్తూ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడకూడదని పలు డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లను కొందరు ఖండిస్తున్నారు, మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకుంటే టీమిండియాకే నష్టమని భారత మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండుల్కర్, సునీల్ గావస్కర్లు అంటున్నారు. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు వెళ్తాయి. ఆ రెండు పాయింట్లు కూడా పాకిస్థాన్‌కు ఇవ్వకుండా మ్యాచ్ ఆడి గెలవాలని సచిన్ అంటున్నారు.
కలకత్తాలో జరిగిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. 'సచిన్‌కు కేవలం రెండు పాయింట్లు మాత్రమే కావాలని, కానీ నాకు టీంఇండియా ప్రపంచకప్ గెలవడం కావాలి' అని గంగూలీ పేర్కొన్నారు. వరల్డ్‌కప్‌లో ప్రతి టీమ్‌తో ఇండియా ఆడుతుంది. ఒక్క పాకిస్థాన్‌తో ఆడనంత మాత్రాన వచ్చే నష్టం లేదని గుంగూలీ స్పష్టం చేశాడు. భారత్, పాక్ మ్యాచ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ తీసుకునే నిర్ణయానికి క్రికెటర్లందరూ కట్టుబడి ఉండాలన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)