తప్పులో కాలేసిన సచిన్‌..

తప్పులో కాలేసిన సచిన్‌..

ఓ ఇంటివారైన బ్యాడ్మింటన్‌ కపుల్‌ సైనా నెహ్వాల్‌-పారుపల్ల కశ్యాప్‌లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రంగాలకతీతంగా ప్రముఖులంతా ఈ సెలబ్రిటీ జంటకు విషెస్‌ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా సైనా నెహ్వాల్‌-పారుపల్ల కశ్యాప్‌లకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. ఐతే.. సైనా -కశ్యప్‌ల ఫోటోను షేర్‌ చేయబోయి.. మరో షట్లర్ కిడాంబి శ్రీకాంత్-సైనా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. వెంటరే నెటిజన్లు ట్రోలింగ్‌ స్టార్ట్‌ చేయడంతో గుర్తించిన సచిన్‌.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి.. సైనా -కశ్యప్‌ల ఫొటోను పోస్ట్‌ చేశాడు.