రక్షా బంధన్ వేడుకల్లో సచిన్‌.. 

రక్షా బంధన్ వేడుకల్లో సచిన్‌.. 

ప్రతి వేడుకనూ అభిమానులతో షేర్‌ చేసుకునే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌.. ఇవాళ రాఖీ పండుగ సందర్భంగానూ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. సచిన్‌ చేతికి తన సోదరి రాఖీ కడుతున్న వీడియోను ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. 'తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల ప్రేమ బంధం ఎప్పటికీ బలపడుతూనే ఉంటుంది' అంటూ ఈ వీడియోకి సచిన్‌ క్యాప్షన్‌ పెట్టారు.