గంగూలీ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సచిన్‌

గంగూలీ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సచిన్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ బర్త్‌డే ఇవాళ. 42వ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకుంటున్న గంగూలీకి సోషల్‌ మీడియాలో విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాడు. ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేసి గంగూలీని విష్‌ చేశాడు. అండర్‌-15 జట్టుకు వారిద్దరూ ఆడిన సమయంలోని ఫొటోను ట్వీట్‌ చేశాడు సచిన్‌. 'హ్యాపీ బర్త్‌డే దాదీ.. అండర్-15 జట్టుకు ఆడడంతో మొదలైన మన ప్రయాణం ఇప్పుడు కామెంట్రీ వరకూ సాగుతోంది. ఇది నిజంగా గొప్ప ప్రయాణం. ఈ ఏడాది నీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నా' అని సచిన్‌ పోస్ట్‌ చేశాడు.