సాధ్వీ ప్రజ్ఞా పేరుపై సభలో గందరగోళం

సాధ్వీ ప్రజ్ఞా పేరుపై సభలో గందరగోళం

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేసేటపుడు లోక్ సభలో పెద్ద వివాదం చెలరేగింది. ఈ వివాదం సాధ్వీ ప్రజ్ఞా పేరు కారణంగా జరిగింది. సాధ్వీ ప్రజ్ఞా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేస్తూ తన పేరును 'సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ స్వామీ పూర్ణచేతనానంద అవధేశానంద గిరి'గా పేర్కొన్నారు. ఇంతలో ప్రతిపక్ష ఎంపీలు దీనిపై హంగామా ప్రారంభించారు. దీంతో సాధ్వీ ప్రజ్ఞా ఆగిపోయారు.


Click this link to see the video: https://twitter.com/ANI/status/1140621665375784962


ప్రమాణ స్వీకారం చేసేటపుడు కేవలం తన పేరుని మాత్రమే పేర్కొనాలని విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సాధ్వీ ప్రజ్ఞ ఇది కూడా తన పేరునని తెలిపారు. దీనిపై ప్రోటెం స్పీకర్ రికార్డులు తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించారు. రికార్డుల్లో ఏ పేరైతే నమోదవుతుందో ఆ పేరుతోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాధ్వీకి మద్దతుగా పలువురు బీజేపీ ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. 

లోక్ సభ అధికారులు ఎంపీల రికార్డ్ ఫైలును డాక్టర్ వీరేంద్ర కుమార్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన రికార్డులు తనిఖీ చేశారు. ఆ కాసేపటిలో ప్రతిపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. సాధ్వీ ప్రజ్ఞ రెండోసారి ప్రమాణం చేయడం ప్రారంభించారు. విపక్ష సభ్యులు మళ్లీ హంగామా చేయసాగారు. దీంతో సాధ్వీ ప్రజ్ఞా మరోసారి ఆగిపోవాల్సి వచ్చింది. చివరికి మూడోసారి ఆమె ప్రమాణ స్వీకారం పూర్తి చేయగలిగారు.