చిత్రహింసలకు క్షమాపణలు చెప్పాల్సిందే

చిత్రహింసలకు క్షమాపణలు చెప్పాల్సిందే

మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను 9 ఏళ్ల పాటు వేధించిన వ్యక్తులు క్షమాపణలు చెప్పాల్సిందేనని సాధ్వి ప్రజ్ఞా సింగ్ డిమాండ్ చేశారు. ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆమె తన మాటలను వెనక్కు తీసుకోవడం తదితరాలకు సంబంధించిన వివరాల కోసం మీడియా ప్రతినిధులు భోపాల్ లోని ఆమె నివాసానికి వెళ్లగా సహనం కోల్పోయారు. 'నేను స్వయంగా నిన్న క్షమాపణలు చెప్పాను. నా తరుపున క్షమాపణలు అడిగే అధికారం మీకు ఇస్తున్నా. మాలేగావ్ కేసులో తొమ్మిదేళ్ల పాటు నన్ను హింసించిన వారితో క్షమాపణలు చెప్పించగలరా?' అని మీడియా ప్రతినిధులను నిలదీశారు.