మరోసారి సాధ్వి ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

మరోసారి సాధ్వి ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ నేత, భోపాల్ లోక్ సభ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే దేశప్రజల్లో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. గాడ్సేను ఉగ్రవాదిగా పిలిచే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో దీటుగా బదులిస్తారని అన్నారు. చమహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.