భయపడేది లేదు..! దూకుడుగానే ఉంటా..

భయపడేది లేదు..! దూకుడుగానే ఉంటా..

ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడేదిలేదు... నేను ఇకపై కూడా దూకుడు గానే ఉంటానని వెల్లడించారు సాధినేని యామిని శర్మ... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. నా పేరుతో ఫేక్ అకౌంట్లు పెట్టి తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై తాను ఎటువంటి అభ్యంతరకరమూఐన పోస్టులు పెట్టలేదని స్పష్టం చేసిన ఆమె... ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్లపై చర్యలు తీసుకోవాల్సింది డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరినట్టు వెల్లడించారు. ఇక, తాను ఎప్పుడూ ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్న సాధినేని యామిని... నాకు, నా భర్తకు ఫోన్‌లు చేసి బెదిరించేలా మాట్లాడుతున్నారని.. మహిళలను అణగదొక్కే ధోరణిపై తాను పోరాడుతానని ప్రకటించారు.