మరో రెండ్రోజుల్లో భార్య డెలివరీ.. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి !

మరో రెండ్రోజుల్లో భార్య డెలివరీ.. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి !

 గుంటూరు జిల్లాలో పరిషత్‌ ఎన్నికల వేళ విషాదం చోటుచేసుకుంది. పిట్టలవానిపాలెం ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు కంచర్ల కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ముత్తపల్లిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బాపట్లలో మృతి చెందిన ఉపాధ్యాయుడు కంచర్ల  కోటేశ్వరరావు మృతదేహాన్ని బాపట్ల నుంచి తీసుకు వచ్చి స్వగ్రామమైన తెనాలి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తెనాలి ఐతనగర్ కు చెందిన ఉపాధ్యాయుడు కంచర్ల  కోటేశ్వరరావు(41) ఎన్నికల విధులకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. నిజంపట్నం మండలం  ముత్తుపల్లి  జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరరావు బుధవారం సాయంత్రం బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలంలోని అల్లూరు మంతెన సత్యనారాయణ రాజు జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాలలో జరగనున్న  ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల విధులకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మృతునికి భార్య కంచర్ల సువర్ణ, పదేళ్ల కుమార్తె ఉన్నారు, అయితే భార్య నిండు గర్భిణీ కాగా మరో రెండురోజుల్లో డెలివరీ ఉందని చెబుతున్నారు. సబ్ కలెక్టర్ మయూరి అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ప్రభుత్వ తరుపు నుంచి రావాల్సిన వాటికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.