ప్రచారంపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ

ప్రచారంపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ

సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న చిత్రలహరి సినిమా ఏప్రిల్ 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  వరసగా ఆరు పరాజయాల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో కలిగిన సంగతి తెలిసిందే.  చిత్రలహరి టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి.  సినిమా రిలీజ్ సందర్భంగా యూనిట్ తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.  

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడారు.  ముఖ్యంగా జనసేన ప్రచారంపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.  తాను ప్రచారం చేస్తానంటే మామయ్యా వద్దన్నాడని, సినిమాపై దృష్టి పెట్టమని చెప్పినట్టు సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు.  అటు వరుణ్ తేజ్, నిహారికలు జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు.  రామ్ చరణ్ కూడా జనసేనకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కూడా పాలకొల్లు నియోజక వర్గంలో జనసేన అధినేత పవన్ తో కలిసి ప్రచారం చేశారు.  

సాయి ధరమ్ తేజ్ కూడా ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోయినా... పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా గ్లాస్ గుర్తుకు ఓటెయ్యమని కోరడం విశేషం.