కొత్త కొత్తగా కనిపించనున్న ధరమ్ తేజ్ !

కొత్త కొత్తగా కనిపించనున్న ధరమ్ తేజ్ !

ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాపులు పడటంతో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు జ్ఞానోదయం కలిగింది.  అందుకే ఈసారి చేయబోయే సినిమా విషయంలో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ముందుగా ఎన్నాళ్ళ నుండో బోర్ కొట్టిస్తున్న లుక్ ను మార్చుకున్నారు.  దాంతో పాటే విపరీతంగా పెరిగిన బరువును కూడ తగ్గించుకున్నారట. 

ఇవన్నీ చేసేందుకు యూఎస్ వెళ్లిన ఆయన వచ్చే వారం తిరిగివస్తారట.  రాగానే కిశోర్ తిరుమల డైరెక్షన్లో సినిమా మొదలువుపెడతారట.  మరి ఈ కొత్త మేకోవర్ తో అయినా ఆయన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారో లేదో చూడాలి.