అది ఎన్టీఆర్ కే సాధ్యం: బుర్ర మాధవ్

అది ఎన్టీఆర్ కే సాధ్యం: బుర్ర మాధవ్

మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేసినిమాలు 'కృష్ణం వందే జగద్గురుం', ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమాలకు సాయి మాధవ్ డైలాగులే హీరో అని చెప్పొచ్చు. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, 'కంచె',‘ఖైదీ నం.150’, ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి భారీ చిత్రాలకు కూడా మాటలు రాశారు. ఇటీవలే సంక్రాంతికి వచ్చిన క్రాక్ సినిమాకు అద్భుతమైన మాటలు రాసాడు సాయి మాధవ్. ఎన్నో హిట్ చిత్రాల‌కి డైలాగ్ రైట‌ర్‌గా ప‌ని చేసిన సాయి మాధ‌వ్ బుర్రా ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి ప‌ని చేస్తున్నారు. కాగా నేడు ఎన్టీఆర్‌ 25 వ వర్థంతి సందర్బంగా చాలా విషయాలు ముచ్చటించారు. ఈ వీడియోలో మీరు చూసేయండి.