రశ్మిక, పూజకు పోటీగా సాయిపల్లవి

రశ్మిక, పూజకు పోటీగా సాయిపల్లవి

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ ఎవరు అంటే ఖచ్చితంగా రశ్మిక, పూజా హేగ్డే పేర్లే వినిపిస్తాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ వారికి పోటీగా దూసుకువెళుతోంది. గత కొద్దికాలంగా వెనుకబడి ఉన్న డాన్సింగ్ డాల్ సాయిపల్లవి ఒక్కసారిగా విజృంభిస్తోంది. నిజానికి ప్రస్తుతం తెలుగు చలన చిత్రపరిశ్రమలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ రశ్మిక, పూజా హేగ్డే. తెలుగులో స్టార్ హీరోల సినిమా ఏదైనా మొదలవుతుందంటే… కథానాయికలుగా రశ్మిక, పూజా హేగ్డే కోసం ట్రై చేయటం అనేది సర్వసాధారణం. వారిద్దరూ అందుబాటులో లేనప్పుడే వేరే హీరోయిన్ వేటలో పడుతుంటారు మన దర్శక నిర్మాతలు. టాలీవుడ్ పై ఆ ఇద్దరు గ్లామర్ తారల ప్రభావం అంతలా ఉందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

స్టార్ హీరోలకంటే తన పాత్రలకు, కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది సాయిపల్లవి. అందుకే ఫిదా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా నిదానమే ప్రధానం అంటూ సాగింది. ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచింది సాయి పల్లవి. నాగచైతన్య 'లవ్ స్టోరీ' పూర్తయి విడుదలకు రెడీ అవుతోంది. ఇక రానాతో విరాటపర్వం, నానికి జోడీగా శ్యామ్ సింగ్ రాయ్, కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా, పవన్, రానా మల్టీస్టారర్ 'బిల్లా రంగా'లో కూడా సాయిపల్లవే హీరోయిన్. ఇలా ఒకే సారి ఐదు సినిమాలో టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. వీటిలో ఏ రెండు మూడు సినిమాలు హిట్ అయినా సాయి పల్లవికి మరిన్ని స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టడం ఖాయం. పైగా పూజ, రశ్మికతో పోలిస్తే సాయి పల్లవి పారితోషికం కూడా తక్కువ. సో పూజ, రశ్మిక జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందన్నమాట.