పెళ్లి చేసుకుంటానో.. లేదో నాకే తెలియదు అంటున్న టాప్ హీరోయిన్... 

పెళ్లి చేసుకుంటానో.. లేదో నాకే తెలియదు అంటున్న టాప్ హీరోయిన్... 

ప్రస్తుతం మన టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో మరికొందరి పై  పెళ్ళికి సంబంధించిన విషయాల పై పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ మధ్యే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయం పై  క్లారిటీ ఇస్తూ అలాంటిది ఏమి లేదు అని స్పష్టత ఇచ్చింది కీర్తి. అదే తరహాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి పెళ్ళికి సంబంధించి చాల పుకార్లు వస్తున్నాయి. ఇక ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెట్టింది పల్లవి. తన పెళ్లి ఫై స్పందిస్తూ... ఇప్పుడు అసలు ఆ ఆలోచన లేదు అని తెలిపింది. నిజం చెప్పాలంటే నేను పెళ్లి చేసుకుంటానో.. లేదో నాకే తెలియదు అంటూ సమాధానం ఇచ్చింది.  ఇక సాయి పల్లవి ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు తనను తెలుగుతెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా  లవ్ స్టోరీ సినిమా చేస్తుంది. అయితే చూడాలి మరి ఈ రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకుంటాయా... లేదా అనేది.