పవన్ సినిమాకి నో చెప్పిన సాయి పల్లవి.. కారణం అదేనంట..?

పవన్ సినిమాకి నో చెప్పిన సాయి పల్లవి.. కారణం అదేనంట..?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌లలో ఒకరు. అందం, అబినయంతో అమ్మడు అందరి మనసులు దోచుకున్నారు. అంతేకాకుండా సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కోసం సంప్రదించారంట. కానీ సాయిపల్లవి ఈ సినిమాకి నో చెప్పారని వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు కారణాలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. కొందరు సాయి పల్లవి డేట్స్ ఖాళీ లేకపోవడం కారణం అంటున్నారు. మరి కొందరు సినిమాలో తన పోర్షన్ తక్కువగా ఉన్నందుకే సాయి పల్లవి సినిమాని రిజెక్ట్ చేశారంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ పాత్రకు భార్య పాత్ర కోసం మూవీ మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించారు. అయితే అమ్మడు ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించనున్నారు. ఏదిఏమైనా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకి నో చెప్పడంపై సాయి పల్లవి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.