వరంగల్ అమ్మాయిగా రౌడి పిల్ల..!!

వరంగల్ అమ్మాయిగా రౌడి పిల్ల..!!

తెలంగాణా యాసతో ఫిదా సినిమాలో సాయి పల్లవి మెప్పించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది.  ఈ మూవీ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు.  ఇప్పుడు రానాతో విరాటపర్వం సినిమా చేస్తున్నది.  వేణు ఉడుగుల దర్శకుడు.  అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  

రానా కిడ్నీ ఆపరేషన్ తరువాత రెస్ట్ తీసుకుంటున్నాడు.  కొన్ని రోజుల రెస్ట్ తరువాత రానా తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.  ఇందులో సాయి పల్లవి వరంగల్ అమ్మాయిగా కనిపిస్తోంది.  నక్సలిజం స్టోరీతో సినిమా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి జానపద కళాకారునిగా కనిపిస్తుందట.