సైఫ్ ఎలా మారిపోయాడో చూశారా..?

సైఫ్ ఎలా మారిపోయాడో చూశారా..?

చేస్తున్న పాత్ర నచ్చితే ఆ పాత్ర కోసం ఎంతైనా కష్టపడే నటులు కొందరే ఉంటారు.  ఆ కొందరిలో ఒకరు సైఫ్ ఆలీ ఖాన్.  ప్రస్తుతం సైఫ్ లాల్ కెప్టెన్ అనే సినిమా చేస్తున్నాడు.  రివెంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నవదీప్ సింగ్.  ఎరోస్ సంస్థ, ఎల్ రాయ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  

ఈ సినిమాకోసం సైఫ్ ఏకంగా నాగసాధువుగా మారిపోయారు.  పొడవుగా జుట్టుపెంచుకొని, ఒంటి నిండా విభూది రాసుకొని, ముఖానికి విభూతి బొట్టు పెట్టుకొని చూడటానికి అచ్చంగా నాగసాధులా కనిపించాడు.  సెప్టెంబర్ 6 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  ఈ నాగ సాధువుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను రీసెంట్ గా రిలీజ్ చేశారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.