ఇంటర్వ్యూ : ఈసారి ఇగోను టచ్ చేశాను.. మారుతి

ఇంటర్వ్యూ : ఈసారి ఇగోను టచ్ చేశాను.. మారుతి

తన ప్రతి సినిమాలో ఒక్కో ప్రాబ్లమ్ ను టచ్ చేస్తూ వస్తున్న మారుతి ఈసారి ఈగో జోలికి వెళ్ళాడు.  భలేభలే మగాడివోయ్ లో మతిమరుపు, మహానుభావుడులో అతి శుభ్రత అనే అంశాలను టచ్ చేసిన మారుతి ఇప్పుడు కొత్తగా ఉంటుంది ఇగో సబ్జెక్టు ను ఎంచుకున్న మారుతి.. ఈ సినిమా గురించిన కొన్ని సంగతులను మీడియాతో పంచుకున్నాడు. 

శైలజా రెడ్డి ఎలా ఉండబోతున్నది..? 

శైలజా రెడ్డి అల్లుడు అనగానే అత్తా అల్లుళ్ళ మధ్య జరిగే యుద్ధంగా అనుకుంటారు.  ఈ సినిమా అందుకు డిఫరెంట్ గా ఉంటుంది.   తల్లి కూతుళ్ళ మధ్య ఉండే ఇగో ప్రాబ్లమ్ ను తన మంచితనం, పాజిటివ్ థింకింగ్ తో హీరో ఎలా పరిష్కరించాడు అన్నది ఇందులో చూపించాం.  

నాగ చైతన్య యాక్టింగ్ గురించి..?

నాగచైతన్య ఈ సినిమాలో చాలా యాక్టివ్ గా కనిపించాడు.   కొన్ని సీన్స్ లో అచ్చు నాగార్జునలా కనిపించి మెప్పించాడు.  సినిమా బాగా వచ్చింది.   నటుడిగా నాగచైతన్య చాలా ఇంప్రూవ్ అయ్యాడు.  గత సినిమాల కంటే ఇందులో భిన్నంగా కనిపిస్తాడు.  

రమ్యకృష్ణ గురించి.. ?

అత్తా క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయింది.  సినిమాకు రమ్యకృష్ణ చాలా ప్లస్ అవుతుంది.  సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది.  

నెక్స్ట్ ప్రాజెక్ట్స్...?

ఈ సినిమా తరువాత యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు చేస్తున్నాను.  ఈ రెండు పూర్తయ్యాక మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాతగా ఓ సినిమా ఉంటుంది.  

విజయ్ దేవరకొండతో సినిమా..?

నేను సినిమాలు చేయాల్సిన హీరోల లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు.  మంచి కథ కోసం వెయిట్ చేస్తున్న.  కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తా.